బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించే సినిమాల సిరీస్ లలో “బాఘి” సిరీస్ కూడా ఒకటి. మన దక్షిణాది నుంచి పలు సూపర్ హిట్ సినిమాలని తను రీమేక్ చేస్తూ ఈ సిరీస్ ని కొనసాగిస్తున్నాడు. భారీ బడ్జెట్ లు యాక్షన్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాల నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమానే “బాఘి 4”. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించగా మంచి హైప్ మధ్య సినిమా వచ్చింది.
కానీ ఈ సినిమా ప్లాప్ గానే నిలిచింది. అయితే కొన్ని రోజులు కితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటడ్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఫ్రీ స్ట్రీమింగ్ కి ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. కేవలం ప్రైమ్ వీడియో సబ్స్క్రయిబర్ అయ్యి ఉంటే ఇక నుంచి ఈ సినిమా ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాలో సోనమ్ బజ్వా హీరోయిన్ గా నటించింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


