మన టాలీవుడ్ సినిమా దగ్గర తన మొదటి సినిమా నుంచే మంచి పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తనకంటూ ఓ సినిమాటిక్ యూనివర్స్ సెట్ చేసి అందులో ఒక సాలిడ్ ప్రాజెక్టుని తీసుకొస్తున్నాడు. అయితే హను మాన్ సినిమాకి తన వర్క్ తో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో తర్వాత మాత్రం సోషల్ మీడియాలో మాత్రం పలు నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోక తప్పలేదు.
ఆ మధ్య జై హనుమాన్ పై వచ్చిన ఓ పోస్టర్ కే ఏ ఐ అంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్ గా మళ్లీ మహాకాళి కి కూడా సోషల్ మీడియాలో ఆ సినిమా ఫస్ట్ లుక్ పై అప్పుడే ప్రాంప్ట్ లు అంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టర్ కి దగ్గరగా పదుల సంఖ్యలో ఏ ఐ వాడి చేయొచ్చు అంటూ ఇందులో ప్రశాంత్ వర్మ సృజనాత్మకత ఏముంది అనే కామెంట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనితో ప్రశాంత్ వర్మ మాత్రం వీటిని సీరియస్ గా తీసుకొని రూటు మారిస్తే బెటర్ అని చెప్పాలి.


