ప్రపంచ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు.. ఒకే రోజు 15 సినిమాలు ప్రారంభం!

టాలీవుడ్ లెజెండరీ నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిలిచారు. శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ వాడిగా ఆయన ఘనత సాధించారు. భీమవరం టాకీస్ అధినేత అయిన ఆయన ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకునేందుకు సిద్ధమయ్యారు.

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ ఫీట్‌తో ప్రపంచ రికార్డును నమోదు చేసేందుకు రామసత్యనారాయణ సిద్ధమవుతున్నారు. ఇక ఈ చారిత్రక ఘట్టానికి హైదరాబ్‌లోని సారధి స్టూడియో వేదిక కానుంది.

ఈ విశేషమైన ఘట్టానికి సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. మన భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15న ఈ అరుదైన ఘట్టం శ్రీకారం చుట్టుకోనుంది.

Exit mobile version