పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా, తొలిరోజు ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ దక్కింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖుల ప్రశంసలు కూడా తోడు కానున్నాయి. ఢిల్లోలోని ఏపీ భవన్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. నిత్యం బిజీగా ఉండే తెలుగు అధికారులు, ఉద్యోగుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు.
ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు పలువురు రాజకీయ నేతలు కూడా హాజరవుతారని తెలుస్తోంది. మొత్తానికి హరిహర వీరమల్లు చిత్రం సినీ ప్రశంసలతో పాటు పొలిటిక్ అప్రిషీయేషన్ కూడా అందుకుంటుంది.