‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘హరిహర వీరమల్లు’ మేనియా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇక తమ అభిమాన హీరో నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘ఓజి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ క్రమంలో ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 1న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటను శింబు పాడగా థమన్ అదిరిపోయే రీతిలో కంపోజ్ చేశాడట. ఇక ఈ సినిమాను సుజిత్ తనదైన మార్క్ టేకింగ్‌తో ప్రేక్షకులను స్టన్ చేసేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version