మౌనీ రాయ్‌తో మెగాస్టార్ మాస్ స్టెప్పులు.. ఈలలు వేసేందుకు ఫ్యాన్స్ సిద్ధం!

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే, ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ షూట్‌ను లాస్ట్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తున్నారు.

ఇక ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి తనదైన వింటేజ్ డ్యాన్స్ స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ పాటలో ఆయనతో పాటు చిందులేసేందుకు బాలీవుడ్ భామ మౌనీ రాయ్ రెడీ అయ్యింది. వారిపై చిత్రీకరిస్తున్న ఈ పాటను గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఈ పాట అత్యద్భుతంగా రూపొందుతోందని.. అభిమానులు విజిల్స్‌తో దుమ్ములేపేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ తాజాగా ప్రకటించారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version