ట్రైలర్ టాక్ : ‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండ మాస్ ట్రీట్.. ప్యూర్ యాక్షన్‌తో రఫ్ఫాడించాడు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ కోసం ప్రేక్షకులతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా జూలై 31న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ మోడ్‌లో కట్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ నుంచి ఇలాంటి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గతకొంత కాలంగా మిస్ అవుతున్న అభిమానులు ఈ ట్రైలర్‌లో దానిని పొందారు. ఇక విజయ్ చేసే యాక్షన్, చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయన మేకోవర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా మారింది. ఇక ఈ సినిమాలో చాలా పాత్రలు కూడా ఉండబోతున్నట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరోవైపు అనిరుధ్ తన సంగీతంతో ఈ ట్రైలర్‌ను ఒక్కసారిగా అలా పైకి లేపేశాడు.

భాగ్యశ్రీ, సత్యదేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version