ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక చిత్రానికి కమిట్ అయ్యారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి పెద్దగా బజ్ ఏమి వినిపించడం లేదు కానీ దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై మాత్రం పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి. దర్శకుడు మొదటి నుంచి ప్రస్తావిస్తున్న “న్యూక్లియర్” అనే టైటిల్ నే నిర్మాతలు పరిశీలసితున్నారని తెలిసింది.
అలాగే దీనితో పాటు మరిన్ని ఆసక్తికర మరియు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. “న్యూక్లియర్”, “మిస్సైల్” అలాగే “రేడియేషన్” అనే మూడు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నయాని టాక్ వినిపిస్తుంది. మరి వీటిలో ఒకటి ఫిక్స్ చేస్తారా లేక మరే ఇతర టైటిల్ తో వస్తారా అన్నది వేచి చూడాలి.