అక్కినేని నాగార్జున అలాగే ధనుష్ ల కలయికలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “కుబేర”. మంచి హైప్ ను సెట్ చేసుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ గా నటించింది. అయితే ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుండగా మన దగ్గర సహా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి బుకింగ్స్ ని కనబరుస్తుంది.
ఇలా యూఎస్ మార్కెట్ లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునేలా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు. కేవలం ప్రీమియర్స్ గ్రాస్ గా మాత్రమే ఆల్రెడీ సినిమా 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని దాటేసింది. దీనితో డే 1 కి ఈజీగా 3 లక్షలకి పైగా వసూళ్లు నమోదు అవుతాయని చెప్పవచ్చు. మరి శేఖర్ కమ్ముల సినిమాలకి యూఎస్ మార్కెట్ లో మంచి రన్ ఉంటుంది. ఇక కుబేర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Records are meant to be broken. ????????
Exciting day ahead at the box office ????#Kuberaa USA premieres pre sales at $250K+ ????????????????????????????????#SekharKammulasKuberaa #Kubera pic.twitter.com/2t8lAfgnNm
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 19, 2025