మార్చ్ నెల మొత్తం చిన్న సినిమాలే

Mr.PelliKoduku

2013 సంవత్సరంలో ఇప్పటికే మూడు సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్, మిర్చి మూడు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. రానున్న మార్చ్ నెలలో చిన్న సినిమాల వరద పారనుంది. మర్చి మొదరి వారంలో మొదటి తారీఖున సునీల్, ఇషా చావ్లా మిస్టర్ పెళ్ళికొడుకు విడుదల కాబోతుంది. తను వెడ్స్ మను రీమక్ గా రాబోతున్న ఈ సినిమాకి దేవి ప్రసాద్ దర్శకుడు. గుండెల్లో గోదారి మార్చ్ 8న విడుదల కాబోతుండగా, స్వామి రా రా కూడా మార్చ్ నెలలోనే రానుంది. ఇవి కాకుండా డి ఫర్ దోపిడీ, దళం, రేస్ లాంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఇదే నెలలో విడుదలకి ప్లాన్ చేసుకుంటున్నాయి. మార్చ్ నెలలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరసగా ప్లాన్ చేసుకుంటున్నాయి.

Exit mobile version