టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు ఇప్పుడున్న యూత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విజయ్ ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లోనూ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన “గీత గోవిందం” చిత్రం. ఈ చిత్రం విడుదలకు ముందే పైరసీ భూతం కబళించినా విడుదలయ్యాక భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
అయితే ఈ చిత్రం ఇంకా విజయ్ తో పట్టాలెక్కకముందు పెద్ద తతంగమే నడిచిందట. ఈ చిత్రం కథ మొదట పరశురామ్ అల్లు అరవింద్ కు ఎప్పుడో చెప్పారట. అదే సమయంలో అలా ఈ స్టోరీ బన్నీ వరకు వెళ్లగా తనకి కూడా చాలా బాగా నచ్చేసింది కానీ ఎంతో నచ్చినప్పటికీ ఈ చిత్రాన్ని బన్నీ వదులుకోవాల్సి వచ్చిందట.
దానికి కారణం బన్నీకు అప్పుడే బోయపాటి శ్రీనుతో తీసిన “సరైనోడు” సినిమాతో అప్పటి వరకు ఉన్న మాస్ ఇమేజ్ ఒకెత్తు సరైనోడు తో వచ్చిన మాస్ ఇమేజ్ ఒకెత్తు అనే రేంజ్ లో బన్నీ మాస్ ఇమేజ్ పెరిగింది. దీనితో వెంటనే గోవింద్ లాంటి సాఫ్ట్ కార్నర్ ఉన్న లీడ్ లో కనిపిస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని బన్నీ ఈ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందట.ఈ విధంగా బన్నీ గీత గోవిందం సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.