మాస్ మహారాజ్ రవితేజ ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ ‘మాస్ జాతర’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే, ఆయన తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించాడు. దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ తన కెరీర్‌లోని 76వ చిత్రాన్ని ప్రారంభించాడు.
ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాను ఇక రెగ్యులర్ షూటింగ్‌తో షురూ చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో రవితేజ తనదైన కంఫర్ట్ జోన్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్‌ను అతి త్వరలో రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.