గెట్ రెడీ.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అప్డేట్ వచ్చేస్తుంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతికృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన భారీ హిస్టారికల్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ పెద్ద సస్పెన్స్ గా మారగా ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు కానీ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ మాత్రం ఇంకా కొత్త రిలీజ్ డేట్ ఇవ్వకుండా మౌనంగానే ఉన్నారు.

కానీ ఫైనల్ గా దీనిపై ఓ అప్డేట్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు జూన్ 18న హరిహర వీరమల్లు రిలీజ్ సహా ట్రైలర్ అప్డేట్ ని అందించనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఒకింత గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version