వైరల్ : ‘ఆపండి..’ అంటూ వారిపై సమంత అసహనం

స్టార్ బ్యూటీ సమంతకు ఆన్‌లైన్‌లో ఎంత క్రేజ్ ఉందో ఆఫ్‌లైన్‌లోనూ అంతే క్రేజ్ ఉంది. ఏదైనా ఈవెంట్‌లో సమంత కనిపిస్తే చాలు, అభిమానులు, ఫోటోగ్రాఫర్లు చేసే రచ్చ మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఈ క్రేజ్ కొంతవరకు హీరోయిన్లకు బాగానే అనిపించినా, ప్రతిసారి వారికి నచ్చదు. తాజాగా సమంత కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.

సమంత తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేసి బయటకు రావడంతో, ఆమెను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. దీంతో ఆమె తీవ్ర ఇబ్బంది పడింది. అంతేగాక ఆమె సీరియస్‌గా ఫోన్ మాట్లాడుతున్నా, ఫోటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టడంతో సామ్ సహనం కోల్పోయింది. ‘స్టాప్ ఇట్ గయ్స్’ అంటూ ఆమె వారిపై అసహనం వ్యక్తం చేసింది.

ఇలా ఓ స్టార్ హీరోయిన్‌ను ఇంతగా ఇబ్బంది పెట్టడం ఫోటోగ్రాఫర్లకు సబబు కాదని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version