నిరాశలో ఈ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ అభిమానులు.!

నిరాశలో ఈ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ అభిమానులు.!

Published on Feb 6, 2021 3:02 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. అలాగే ఇందులో ఉండే వెబ్ కంటెంట్ లో మన ఇండియన్ కంటెంట్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. అలా మన నుంచి వచ్చిన పలు ఆసక్తికర వెబ్ సిరీస్ లలో “ది ఫ్యామిలీ మ్యాన్” సిరీస్ కూడా ఒకటి. రాజ్ మరియు డీకే లు డైరెక్ట్ చేసిన సీజన్ 1 మన ఇండియాలో యూనానిమస్ గా హిట్ అయ్యింది.

దీనితో దేశ వ్యాప్తంగా సీజన్ 2 పై మంచి అంచనాలే నెలకొన్నాయి. అంతా బాగానే ఉంది ఈ ఫిబ్రవరి 12 న అన్ని ముఖ్య భాషల్లో ఈ సిరీస్ విడుదలకు రెడీ కాబోతుంది అనుకునే లోపే ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ వాయిదా పడినట్టు కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈ సిరీస్ అభిమానులే కాకుండా ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ సమంతా ఫ్యాన్స్ కూడా బాగా నిరాశకు లోనయ్యారు. ఇప్పటికీ కూడా అదే అభిప్తాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వేసవిలో ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు