పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న క్రేజీ హారర్ రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా వచ్చిన టీజర్ తర్వాత మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
దీనితో రాజా సాబ్ కోసం సాలిడ్ ఓటిటి డీల్స్ వస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సాలిడ్ ఆఫర్ ని ది రాజా సాబ్ కోసం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారు ఒక్క హిందీ హక్కులు కోసం 100 కోట్లకి పైగా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇది మాత్రం భారీ మొత్తం అని చెప్పాలి. అది కూడా సింగిల్ భాషకి అంటే క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు.