ఐడియా కంపెనీ వారు నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు మాట్లాడుతూ “మంచి సినిమా చేసినపుడు తెలుగు ప్రేక్షకులు దానిని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు హేట్సాఫ్ చెబుతున్నాను. ప్రతీసారి ఎగ్జైటింగ్ గా ఉండేది కానీ ఈసారి మాత్రం సంతృప్తిగా ఉంది. వెంకటేష్ గారి లాంటి డిసిప్లిన్ యాక్టర్ ని నేనెప్పుడూ చూడలేదు. ఆయనతో కలిసి చేయడం మెమరబుల్ ఎక్స్పీరియన్స్. బాలీవుడ్లో చేసే ఆలోచన ఏమైనా ఉందా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇంతకుముందే చెప్పుకున్నట్లు నా ఫోకస్ అంతా తెలుగు మీదే వేరే భాషలో చేసే ఆలోచనే లేదు అన్నారు.