రామ్ చరణ్ బర్త్ డే ఈనెల 27న కావడంతో మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి తోడు ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు రోల్ చేస్తున్న నేపథ్యంలో ఆయన లుక్ విడుదల చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఖచ్చితంగా రాజమౌళి చరణ్ ని అల్లూరిగా పరిచయం చేస్తాడు అనే గ్యారంటీ లేదు. కానీ ఆర్ ఆర్ ఆర్ నుండి టైటిల్ లేదా మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చే వీలుంది. దీనితో ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం చరణ్ బర్త్ డే కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇద్దరు హీరో ఫ్యాన్స్ కి పండగే కాబట్టి.. చరణ్ పుట్టినరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ప్రత్యేకంగా నిలవనుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు మరో పదినెలల సమయం ఉంది. 2021 జనవరి 8న ఈ చిత్రం దాదాపు పది భాషలలో విడుదల కానుంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ కి నిర్మాతగా డి వి వి దానయ్య ఉన్నారు.