విష్ణు నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేసేది ఆ స్టార్ కొరియోగ్రాఫర్..?

హీరో విష్ణు మంచు తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’తో బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకున్నాడు. విష్ణు కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘కన్నప్ప’ నిలిచింది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ డివోషనల్ డ్రామాలో భారీ క్యాస్టింగ్ నటించారు.

ఇక ‘కన్నప్ప’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విష్ణు కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే తాను ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తానని విష్ణు మీడియాతో వెల్లడించారు. అయితే, ఈ సినిమాను ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.

Exit mobile version