అక్కినేని హీరో మోస్ట్ అవైటెడ్ కాంబో సెట్టయ్యింది.!

ఈరోజు అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగార్జున పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు సందడి మొదలు పెట్టీసారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా నాగార్జునకు విషెష్ తెలిపారు. అలాగే ఇదే పుట్టినరోజు సందర్భంగా అక్కినేని కుటుంబీకులు కూడా స్పెషల్ గా తెలిపారు. అలాగే ఇదే సమయంలో నాగార్జున అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక మోస్ట్ అవైటెడ్ చిత్రం అనౌన్స్మెంట్ అయ్యింది.

అక్కినేని అభిమానులకు మరియు అక్కినేని కుటుంబంలో ఒక చిరస్థాయిలో నిలిచిపోయే “మనం” అనే చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ తో నాగ చైతన్య ఒక ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించారు. దీనితో ఆ ప్రాజెక్ట్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్టుగా నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. అలాగే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహించనుండగా ఈ చిత్రానికి “థాంక్ యు” అనే టైటిల్ ను పెట్టారు. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

Exit mobile version