రజినీ, కమల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!

కోలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా బిగ్గెస్ట్ ఎవర్ కాంబినేషన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కలయికలో సినిమా పడబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఇది వరకే విక్రమ్, కూలీ సినిమాలు చేసిన వీరు ఇద్దరు కలిసి ఓకే సినిమాలో ఈ దర్శకుని అండర్ లో కనిపించనున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ని కొంచెం ఫోర్స్డ్ గానే ఇరికించినట్టు టాక్ నడుస్తోంది కానీ లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ పనులలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది వరకు లోకేష్ కనగరాజ్ కూలీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటానని చెప్పాడు కానీ ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో అలాంటివి పెద్దగా తీసుకోకుండానే ఇద్దరితో కలిపి సినిమా తీసి హిట్ కొట్టాలని చూస్తున్నాడట. దీనితో అతి త్వరలోనే ఈ బిగ్ ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అని ఇప్పుడు తెలుస్తోంది.

Exit mobile version