కన్నడ సినిమా నుంచి వచ్చి సంచలన విజయం సాధించిన రీసెంట్ చిత్రాల్లో నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార లెజెండ్ కూడా ఒకటి. తెలుగు స్టేట్స్ లో భారీ హిట్ అయ్యిన ఈ సినిమా ఇపుడు ప్రీక్వెల్ తో రాబోతుంది. ఈ అక్టోబర్ మొదటి వారంలో రాబోతున్న ఈ సినిమా మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ ని ఆశిస్తున్నారట.
ఏకంగా 100 కోట్ల మేర డీల్ గా మేకర్స్ క్వోట్ చేస్తున్నారట. ఇది మాత్రం ఒక షాకింగ్ మొత్తం అని చెప్పాలి. పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ దానికి ప్రీక్వెల్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వరకు పాన్ ఇండియా ఆడియెన్స్ ని ఎగ్జైట్ చేసిన సాలిడ్ కంటెంట్ కూడా ఇంకా రాలేదు.
అయినప్పటికీ 100 కోట్ల డీల్ అంటే చాలా ఎక్కువే అని చెప్పాలి. మరి మేకర్స్ ఆశిస్తున్న అంతమొత్తం పెట్టి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూడాలి. ఇప్పటికే చాలా సినిమాల బిజినెస్ లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సమయంలో ఈ సినిమాకి కూడా ఇంతమొత్తం అంటే ఓసారి ఆలోచించాల్సిందే.