ఓటిటి, టీవిలో అదరగొట్టిన ‘భైరవం’..!

bhairavam

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ కలయికలో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “భైరవం”. డీసెంట్ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా థియేటర్స్ తర్వాత ఓటిటిలో కొన్ని వారాల కితం విడుదల అయ్యింది.

తెలుగు సహా హిందీలో జీ5లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా తెలుగులో ఇదే జీ తెలుగు ఛానెల్లో మొదటిసారి ప్రసారానికి రాగ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ చిత్రానికి టీఆర్పీ గా 5.7 రేటింగ్ వచ్చినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇది ఈ మధ్యలో వచ్చిన బెస్ట్ రేటింగ్స్ లో ఒకటి కాగా ఓటిటిలో కూడా 150 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఈ చిత్రం సొంతం చేసుకుందట. ఇలా ఓటిటి, టీవీ రెండిట్లో కూడా భైరవం అదరగొట్టింది అని చెప్పవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Exit mobile version