పరిశ్రమలో హీరో అంటేనే ప్రత్యేకం, ఇక స్టార్ హీరో అంటే వాళ్ళ రేంజ్, వాళ్ల అట్టిట్యూడ్, బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే వారు సామాన్యులు కాదనే భావన ఉంటుంది. ఫ్యాన్స్ వారికిచ్చే గౌరవం, అభిమానించే తీరు వారిని అలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కానీ కొంత మంది స్టార్లు అలా ఉండరు, తమ చుట్టూ ఉండే వారికీ, వారి పనివారికి, ఉద్యోగులకు చాలా గౌరవం ఇస్తారు. వాళ్ళతో కలసిపోయి మంచి మనసు చాటుకుంటారు.
అలాంటి స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. బన్నీ తన వ్యక్తి గత సిబ్బందికి చాల ప్రాధాన్యం ఇస్తారు. వారి ఇంట్లో జరిగే వేడుకలకు స్వయంగా హాజరవుతారు. చాల దిగువ స్థాయి సిబ్బందికి కూడా అల్లు అర్జున్ చాల ఇంపార్టెన్స్ ఇస్తారు. నేడు తన వ్యక్తి గత సిబ్బందిలో ఓ వ్యక్తి పుట్టిన రోజు బన్నీ జరిపారు. కొద్దిరోజుల క్రితం తన పర్సనల్ బాడీ గార్డ్ పుట్టిన రోజు స్వయంగా నిర్వహించారు. ఇక తన పి ఆర్ టీం తన సక్సెస్ పిల్లర్స్ అని చెప్పుకున్న గొప్ప హీరో బన్నీ అని చెప్పొచ్చు.