పవన్ ఫోన్ లో ‘ఓజి’ నుంచి ఉన్న ఆ ఒకే ఒక్క సాంగ్ ఏంటో తెలుసా!

పవన్ ఫోన్ లో ‘ఓజి’ నుంచి ఉన్న ఆ ఒకే ఒక్క సాంగ్ ఏంటో తెలుసా!

Published on Sep 18, 2025 1:14 PM IST

OG-songs

ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో ఓజి సినిమా హవా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఆ పీక్ వాతావరణం ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇలా తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ దిశగా వెళుతుండగా ఈ సినిమాకి సెన్సేషనల్ ఆల్బమ్ ని సంగీత దర్శకుడు థమన్ అందించడం జరిగింది.

ఇలా వచ్చిన అన్ని పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఫైర్ స్టార్మ్, సువ్వి సువ్వి అలాగే ట్రాన్స్ ఆఫ్ ఒమీ ఇంకా లేటెస్ట్ గా గన్స్ ఎన్ రోజెస్ పాటలు వచ్చాయి. అన్నీ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసాయి. కానీ పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాత్రం ఓజి ఆల్బమ్ నుంచి ఒకే ఒక్క సాంగ్ ఉందని థమన్ రివీల్ చేసాడు. మరి ఆ సాంగ్ ఏదో కాదట హీరోయిన్ ప్రియాంక మోహన్ తో సాగే రొమాంటిక్ మెలోడీ సువ్వి సువ్వి సాంగ్ అట. దీనితో ఈ ఆల్బమ్ లో తనకి బాగా నచ్చిన సాంగ్ ఇదే అని చెప్పవచ్చు.

తాజా వార్తలు