ఎన్టీఆర్ స్లిమ్ లుక్స్.. నీల్ ఓ పోస్టర్ వదలాల్సిందే!

ఎన్టీఆర్ స్లిమ్ లుక్స్.. నీల్ ఓ పోస్టర్ వదలాల్సిందే!

Published on Nov 5, 2025 7:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నటుడు అనేది అందరికీ తెలిసిందే. కానీ తనలో ఒక ఊహించని డెడికేషన్ కూడా ఉందని చెప్పాలి. ఒకప్పుడు లుక్స్ కి ఇప్పుడు లుక్స్ కి తేడా చూస్తే తారక్ తనను తాను ఆవిష్కరించుకోవడంలో ఎంత కష్టపడ్డాడు అనేది తెలుస్తోంది.

కానీ లేటెస్ట్ గా ఎన్టీఆర్ లుక్స్ పరంగా మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఒకింత వర్రీ గానే ఉన్నారు. తారక్ అంతకంతకూ సన్నబడుతుండడంతో ఎందుకు ఇంతలా స్లిమ్ అవుతున్నాడో అనేది తమకి పాలుపోవడంలేది. అయితే ఇదంతా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా కోసమే అని అందరికీ తెలుసు.

అయితే ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ లుక్స్ వైరల్ అవుతున్నాయి. కానీ సినిమాలో నీల్ ఎలాంటి మేకోవర్ సిద్ధం చేశారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు కదా? సో ఇలాంటి కామెంట్స్ ఆందోళనలకి చెక్ పెట్టాలి అంటే నీల్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ పై వదిలితే బాగుంటుంది అని చెప్పాలి. అప్పుడు కూడా తారక్ అభిమానులు తమ టెన్షన్ నుంచి బయటకి వచ్చినవాళ్ళు అవుతారు.

తాజా వార్తలు