పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ఓజి. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. దిగ్గజ స్ట్రేమ్మింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చింది.
ఇక మొదటి వారం లోనే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఈ రెండు వారాల్లో కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాల్లో ఓజి సినిమా 5.3 మిలియన్ వ్యూస్ అందుకోగా గ్లోబల్ గా టాప్ 7 లో ట్రెండ్ అవుతుందట. అంతేకాకుండా ఇండియా వైడ్ అయితే ప్రస్తుతం టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది. ఇలా మొత్తానికి ఓటీటీలో కూడా ఈ సినిమా సత్తా చాటుతుంది అని చెప్పవచ్చు.


