ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌ను షేక్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. బోల్డ్ రొమాంటిక్ కంటెంట్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఆ తర్వాత మంగళవారం, మహాసముద్రం వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు ఈ డైరెక్టర్ రెడీ అయ్యాడు. త్వరలో తాను తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, అజయ్ భూపతి తన నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.


