టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పలు సినీ ఈవెంట్లలో ఆయన హాజరుకావడంతో ఈ ఊహాగానాలు మరింత బలంగా మారాయి.
ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తన రెస్పాన్స్ ఇచ్చారు. “ప్రస్తుతం నేను ఎటువంటి సినిమా నిర్మాణంలో లేను. రీ ఎంట్రీ వార్తలు పూర్తిగా నిరాధారం, తప్పు” అంటూ ఆయన స్పష్టం చేశారు. అభిమానులు, మీడియా తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
ఆయన ఇచ్చిన ఈ క్లారిటీతో రూమర్లకు చెక్ పడినట్టు అయ్యింది. అయినా, బండ్ల గణేష్ సినిమా ఈవెంట్స్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు గుసగుసలాడుతుండటం గమనార్హం.


