మోలీవుడ్ సినిమా మెగాస్టార్ హీరోస్ లో ఒకరైన మోహన్ లాల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారని చెప్పాలి. కొన్నాళ్ల కితం వరకు సరైన హిట్ కోసం స్ట్రగుల్ అయ్యిన తాను ఇపుడు ఒక్క ఏడాదిలో ఒకదాన్ని మించి ఒక బ్లాక్ బస్టర్ ని డెలివర్ చేస్తూ భారీ గ్రాసర్స్ ని అందించారు. ఇలా ఈ ఒక్క 2025 లోనే మొత్తం నాలుగు సినిమాలు అందులో తాను హీరోగా నటించిన సినిమాలు మూడు వస్తే ఇప్పుడు నాలుగో సినిమా తన నుంచి వచ్చేస్తుంది.
ఆ చిత్రమే “వృషభ”. ఎంపురాన్, తుడరుం అలాగే హృదయపూర్వం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న తాను తెలుగులో కన్నప్ప చిత్రంతో మొత్తం నాలుగు సినిమాల్లో ఈ ఒక్క ఏడాదిలోనే కనిపించి ఓ స్టార్ హీరో నుంచి ఈ మధ్య కాలంలో జరగని రేర్ ఫీట్ ని సెట్ చేసి తన నామ సంవత్సరంగా మార్చుకున్నారని చెప్పాలి. ఇక వీటి తర్వాత ఈ ఏడాదిలోనే తన వృషభ కూడా వచ్చేస్తున్నట్టు డేట్ ని అనౌన్స్ చేశారు.
దర్శకుడు నందకిషోర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం ఈ నవంబర్ 6న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్స్ తో రివీల్ చేశారు. సో మోహన్ లాల్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ ఏడాది పండుగే అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా సాలిడ్ రోల్ లో నటించగా మహావతార్ నరసింహ, ఖైదీ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రానికి కనెక్ట్ మీడియా, ఏవిఎస్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.