‘డ్యూడ్’ తెలుగు పలుకులు.. ప్రదీప్ రంగనాథన్ సెల్ఫ్ టెస్ట్

ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో కోలీవుడ్ నుంచి వస్తున్న చిత్రం “డ్యూడ్” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నేహా శెట్టి, మమిత బైజు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా వస్తుంది. అయితే ఈ సినిమా కోసం డ్యూడ్ ప్రదీప్ రంగనాథన్ తనని తాను సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటున్నాడట.

మెయిన్ గా తెలుగు డబ్బింగ్ కోసం అన్నట్టు రివీల్ చేసాడు. తమిళ్ లో ఎలాగో తన వాయిస్ నే ఉంటుంది. కానీ తెలుగులో మాత్రం ఈసారి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడట. తెలుగులో తన డబ్బింగ్ సెట్ అయితే తన వాయిస్ లోనే సినిమా ఉంటుందని తాను చెబుతున్నాడు. మరి ఈ సినిమాకి తన నోటి నుంచే తెలుగు పలుకులు ఉంటాయా లేదా అనేది ఈ అక్టోబర్ 17 వరకు ఆగితే తెలిసిపోతుంది.

Exit mobile version