ఈ దీపావళి కానుకగా వస్తున్న చిత్రాల్లో స్ట్రైట్ మన తెలుగు సినిమా నుంచి మాత్రమే కాకుండా డబ్బింగ్ నుంచి కూడా పలు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రదీప్ రంగనాథన్ నటించిన డబ్బింగ్ చిత్రం డ్యూడ్ కూడా ఒకటి. అయితే అక్కడ నుంచి మన దగ్గరకి డబ్ అయ్యిన సినిమాలు వస్తున్నాయి కానీ మన నుంచి తమిళ్ లోకి వెళుతున్న సినిమాలు మాత్రం దీపావళికి కనిపించడం లేదు.
ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ‘కే ర్యాంప్’ ప్రమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు ఇటు తెలుగులోని అటు తమిళ్ లో కూడా చర్చకి దారి తీశాయి. ప్రదీప్ నటించిన డ్యూడ్ సినిమాకి మన తెలుగులో థియేటర్స్ దొరుకుతున్నాయి కానీ నా సినిమాకి మాత్రం తమిళ్ లో థియేటర్స్ ఇవ్వం అని చెప్పేస్తున్నారని ఓపెన్ గానే చెప్పాడు. అయితే ఖచ్చితంగా కిరణ్ ఆవేదనలో అర్ధం ఉంది అనే చెప్పాలి.
ఎంతసేపు తెలుగులో కోలీవుడ్ సినిమాలు అక్కడి స్టార్స్ మన దగ్గర కూడా మార్కెట్ సంపాదించుకోవడం జరిగింది కానీ తెలుగు హీరోలకి, తెలుగు సినిమాలకి అక్కడ ఆదరణ అనేది వారికి మనమిచ్చే ఆదరణతో పోలిస్తే వారు మనకిచ్చే ఆదరణతో పోలిస్తే చాలా తక్కువే.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లో మార్కెట్ సంపాదించుకున్న హీరోలు ఎంతమంది అంటే చాలా లిస్ట్ వస్తుంది.
అదే మన నుంచి ఉన్న హీరోలు ఎంతమంది? ఒకవేళ డబ్బింగ్ చేసి వదిలినా అక్కడి జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. పైగా తమిళ్ డబ్బింగ్ ఖర్చులు కూడా ఎక్కువే అని సినీ వర్గాల్లో టాక్ కూడా ఉంది. మరి ఈ సమీకరణాలతో ఒక్క కిరణ్ అబ్బవరమే కాకుండా సగటు తెలుగు ఆడియెన్ కూడా కోరుకునే ఈ కాంక్షలో అర్ధం ఉండి తీరుతుంది. సో ఇక నుంచి అయినా ఇవన్నీ మారుతాయేమో చూడాలి.