టాలీవుడ్‌లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ ఎవర్‌గ్రీన్ చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. దర్శకుడు కె.విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీకి టీవీలో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. ఇప్పటికీ ఈ సినిమా టెలికాస్ట్ అవుతుందంటే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1, 2026లో ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.
క్లీన్ కామెడీ అండ్ రొమాన్స్‌తో పాటు ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, ఫ్లోరా షైనీ, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసినీ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కోటీ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది.