అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు ఎన్టీఆర్ పాఠాలు.

అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు ఎన్టీఆర్ పాఠాలు.

Published on Jun 17, 2020 12:45 PM IST

షూటింగ్స్, మీటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోలకు లాక్ డౌన్ కారణంగా తమ కుటుంబాలతో గడిపే సమయం దొరికింది. దీనితో అందరూ తమకు ఇష్టం వచ్చిన వ్యాపకాలలో మునిగిపోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన భార్య పిల్లలతో హ్యాపీగా గడిపేస్తున్నాడు. వంటలో ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం స్వయంగా రుచికరమైన వంటకాలు చేస్తున్నాడట. అలాగే కొడుకులు అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ లకు తెలుగులో శిక్షణ ఇస్తున్నాడట. అలాగే వారి తాతగారైన తారకరామారావు గారి సినిమాలను వారితో కలిసి చూస్తూ ఆస్వాదిస్తున్నాడట. ఇలా అధ్బుతమైన ఫ్యామిలీ లైఫ్ ఆయన అనుభవిస్తున్నాడని సమాచారం.

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, త్వరలో ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే ఓ భారీ సెట్ నిర్మించిన చిత్ర బృందం మోక్ షూటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు