మంచు విష్ణు నటిస్తున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’ టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు.
కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం విష్ణు అండ్ టీమ్ ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఈ సినిమాకు నో చెప్పాడట. ఒకటి కాదు రెండు సార్లు అక్షయ్ కుమార్ ఈ సినిమాకు నో చెప్పాడని.. అయితే, ఓ బాలీవుడ్ డైరెక్టర్ సూచనతో అక్షయ్ కన్నప్ప మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాడని మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈతరం ప్రేక్షకులకు శివుడిగా అక్షయ్ కుమార్నే చూపెట్టాలని తాను భావించానని.. అందుకే పట్టువదలకుండా అక్షయ్ కుమార్ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించానని విష్ణు తెలిపాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్ క్యాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతుంది.