“ఆచార్య”కు ఇంకా ఇక్కడ డీల్ మాత్రమే మిగిలి ఉందా..?

“ఆచార్య”కు ఇంకా ఇక్కడ డీల్ మాత్రమే మిగిలి ఉందా..?

Published on Feb 4, 2021 1:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. చాలానే అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు ఒక పక్క షూటింగ్ తో పాటుగా మరో పక్క బిజినెస్ కూడా జరుపుకుంటుంది అని టాక్ విన్నాం.

అయితే మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి బిజినెస్ ను చూగొంటున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఇంకా ఓ చోట డీల్ మాత్రమే మిగుల్చుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీ లో ఇప్పటికే బిజినెస్ ను జరుపుకున్న ఈ చిత్రం ఒక్క నైజాం మినహా ఓవరాల్ గా అన్ని చోట్లా కూడా పూర్తి అయ్యినట్టుగా ఇండస్ట్రీ శ్రేణులు చెప్తున్నాయి.

ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల మేర బిజినెస్ ను జరుపుకుంటుంది అన్న ఈ భారీ చిత్రం ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందో చూడాలి. మై ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు