ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అనేక ప్రాజెక్ట్ లు అంగీకరించిన సంగతి తెలిసిందే. మరి వాటిలో ఒక్కో దానిపై ఒక్కో రకంగా అంచనాలు ఉన్నాయి. అయితే మరి వీటిలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కూడా ఒకటి. కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం కాస్త విరామం తీసుకొని ఒక్కో షెడ్యూల్ ను పూర్తి చేస్తున్నారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రం పై వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం ఫస్ట్ లుక్ పోస్టర్ సహా టైటిల్ ను కూడా మేకర్స్ వచ్చే మార్చ్ 11న శివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నారని మరి వీటితో పాటుగా ఈ చిత్రం విడుదల తేదీపై కూడా ఒక క్లుప్తమైన క్లారిటీ ఇచ్చేస్తారని నయా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎ ఎమ్ రత్నం నిర్మాణం వహిస్తున్నారు.