స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మన దగ్గర మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే బన్నీ డాన్సులు అంటే అక్కడి బడా హీరోలు సైతం ఇష్టపడడమే కాకుండా మెస్మరైజ్ అయ్యిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఇక లేడీ ఫాలోయింగ్ కానీ హీరోయిన్స్ లో కానీ బన్నీ క్రేజ్ కోసం చెప్పనవసరం లేదు.
మరి ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కూడా చేరిపోయింది. ఆమెనే సాయి మంజ్రేకర్.బాలీవుడ్ లో సల్మాన్ తో “దబాంగ్ 3” లో నటించి ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ “మేజర్”, వరుణ్ తేజ్ తో “గని” చిత్రాల్లో బిజీగా ఉంది. అయితే తాను బన్నీ లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” సినిమా చూసిందట. అంతే అక్కడ నుంచి స్టన్ అయ్యిపోయిందట, బన్నీ నటన డాన్స్ లు విపరీతంగా నచ్చేశాయట.
దీనితో బన్నీతో ఓ సినిమా చెయ్యాలి అనుకుంటున్నాని తన మనసులో మాట ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది. అయితే ఇప్పుడు బన్నీ చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” తర్వాత కొరటాలతో ప్లాన్ చేసిన మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు ఈమె పేరు రేస్ లోకి వచ్చిందని ఆ మధ్య టాక్ వచ్చింది. మరి ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ తన కోరిక నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.