మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడు 70 రోజులను కంప్లీట్ చేసి ఇంకొక నెల వ్యవధి తో ఫైనల్స్ కు చేరుకుంటుంది. అయితే ఇప్పటికే చాలా అసమయం అయ్యింది దీనితో ఆడియెన్స్ కు కూడా కంటెస్టెంట్స్ పట్ల కూడా చాలా మేర అవగాహన వచ్చింది.
అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంస్ట్స్ లో కూడా పలువురు మొదటి నుంచి టాప్ 5 లో కొనసాగుతున్నారు. అలా వారిలో ఎవరికి తగ్గ సామర్ధ్యంతో వారి ఓటింగ్స్ ను కూడా రాబట్టుకుంటున్నారు. అంతే కాకుండా వారిలో మరికొంత మంది అయితే నిగిటివో పాజిటివో ఏదోలా మాత్రం సోషల్ మీడియాలో రేంజ్ లో రచ్చ లేపుతున్నారు.
అలా ఇప్పుడు ఏకంగా దేశ వ్యాప్తంగా ఓ కంటెస్టెంట్ పేరు ట్రెండ్ అవుతుంది అతడే అఖిల్. ఈ కంటెస్టెంట్ క్యాప్టెన్ అయ్యి నామినేషన్స్ లో రైజ్ చేసిన పాయింట్ లు నెటిజన్స్ మరియు బిగ్ బాస్ వీక్షకుల్లో ఓ రేంజ్ లో చర్చగా సాగుతున్నాయి. దీనితో ఏకంగా ఈ కంటెస్టెంట్ పేరు ఇండియన్ వైడ్ ట్రెండ్స్ లోకి 20 వేలకు పైగా ట్వీట్స్ తో ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది. మరి ఇంకా ముందు నుంచి ఏం జరగనుందో చూడాలి.