మన టాలీవుడ్ లో కొన్ని కంబినేషన్స్ అంటే ఎనలేని క్రేజ్ ఉంది. అలాంటి కాంబోలలో ఒకటే బోయపాటి శ్రీను మరియు నందమూరి నటసింహం బాలకృష్ణల కాంబో. “సింహా” నుంచి మొదలైన వీరి సినీ ప్రస్థానం ఇప్పుడు హ్యాట్రిక్ దిశకు వచ్చింది. అలా ప్లాన్ చేసిన మూడో సినిమా తాలూకా టీజర్ ఇటీవలే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ఇవన్నీ పక్కన పెట్టి దర్శకుడు బోయపాటి శ్రీను విషయానికి వస్తే మాస్ ఎలెమెంట్స్ ప్లస్ ఎమోషన్స్ కి కేరాఫ్ అడ్రెస్ బోయపాటి. మాస్ యాక్షన్ సీక్వెన్సులు అయితే ఓ రేంజ్ లో ఉంటాయి. అలా తన ప్రతీ సినిమాలోనూ ఒక బెంచ్ మార్క్ లాంటి యాక్షన్ సీక్వెన్సులు ఆయన సినిమాలో కనిపిస్తున్నాయి.
అది “జయ జానకి నాయక” లోని హంసలదీవి ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, “సరైనోడు”లో ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ అలాగే లేటెస్ట్ “వినయ విధేయ రామ” లోని ఇంటర్వెల్ తర్వాత రెట్రో యాంగిల్ ఫైట్ సీక్వెన్స్ లు కానీ ఇప్పటికీ మాస్ ఆడియెన్స్ రిపీటెడ్ గా చూస్తారు.
ఇప్పుడు ఇలాంటి ఓ పవర్ యాక్షన్ సీక్వెన్సునేనా ఈ టీజర్ లో పెట్టారు అనిపిస్తుంది. ఇందులో బాలయ్యకు ఎదురుగా “చైన్ సా మెషిన్” లతో విలన్స్ కనిపిస్తున్నారు. సో ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా గట్టిగానే ఉంటుంది అనిపిస్తుంది. అసలే వీరి నుంచి మూడో సినిమా మరి బోయపాటి ఏ స్థాయిలో ప్లాన్ చేసారో చూడాలి.