చరణ్ లైనప్ లో మాస్, క్లాస్ దర్శకులు?

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలు అంతా ఇపుడు ఒక సినిమా చేస్తూనే తమ నెక్స్ట్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకొని ప్లానింగ్ ప్రకారం నడుస్తున్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఇంకా మంచి స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నారు. అయితే ఇప్పుడు చరణ్ రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే ప్రాజెక్ట్ తో పాటు కొరటాలతో “ఆచార్య” లో కూడా కనిపించనున్నారు. కానీ వీటి తర్వాత ఏ దర్శకునితో ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా చేస్తారు అన్నది ఇంకా సరైన క్లారిటీ రాలేదు.

అయితే వీటి తర్వాత చరణ్ తో చేసేందుకు ఇద్దరి మాస్ మరియు క్లాస్ చిత్రాల దర్శకులు లైన్ లో ఉన్నట్టు బజ్ వినిపిస్తుంది. వారే టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తన సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు సందీప్ వంగ, మరొకరు బాలీవుడ్ లో వెళ్లేందుకు రెడీగా ఉన్న డీసెంట్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ తిన్ననూరి. ఈ ఇద్దరి దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో తరహా సినిమా స్పెషలిస్టులు వీరిద్దరి పేర్లే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఏ దర్శకునితో చరణ్ సినిమా ఉండనుందో చూడాలి.

Exit mobile version