“సర్కారు వారి పాట”లో ఈ సీన్స్ కూడా తీసేస్తున్నారా.?

“సర్కారు వారి పాట”లో ఈ సీన్స్ కూడా తీసేస్తున్నారా.?

Published on Feb 7, 2021 9:00 AM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు చేసుకున్న ఈ చిత్రం తాలూకా షూట్ ఇప్పుడు దుబాయ్ లోని శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే అక్కడ ఏయే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారో అన్నది కూడా తెలుస్తుంది. ఇటీవలే అక్కడ సార్జా ఎడారిలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మరో గాసిప్ కూడా ఇందులో వినిపిస్తుంది. ఈ సన్నివేశమే మహేష్ సాలిడ్ ఇంట్రో సీక్వెన్స్ అని కూడా తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఈ సీక్వెన్స్ మాత్రం సిల్వర్ స్క్రీన్ పై మహేష్ ప్రెజెన్స్ తో అదరనుంది అనేది మాత్రం కన్ఫర్మ్ గా తెలుస్తుంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు