బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో?

బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో?

Published on Nov 19, 2020 8:10 PM IST

తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 లో నిన్నటి ఎపిసోడ్ తో మంచి పాజిటివ్ వాతావరణం నెలకొంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ వారపు నామినేషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో తెలిసిందే. మళ్ళీ వాటి విషయానికి వస్తే అంతా షరా మామూలే కావచ్చు. అయితే ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

వారిలో ఎవరెవరు డేంజర్ జోన్ లో ఉన్నారో అన్న దానిపై గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ వారం మోనాల్ మరియు లాస్యలు డేంజర్ జోన్ లో ఉన్నారని టాక్. మోనాల్ విషయంలో ఎప్పటి నుంచో ఈ చర్చ వస్తూనే అలాగే ఆమె సేఫ్ అవుతూనే ఉంది. మరి ఇందులో మతలబు ఏంటో ఎవరికీ అర్ధం కావట్లేదు. అలాగే లాస్య విషయంలో మాత్రం గట్టి టాకే వినిపిస్తుంది. మరి ఈ వారాంతం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలి.

తాజా వార్తలు