‘థామా’లో ఆ ముగ్గురు స్టార్స్ ‘స్పెషల్’..!

‘థామా’లో ఆ ముగ్గురు స్టార్స్ ‘స్పెషల్’..!

Published on Oct 21, 2025 8:00 AM IST

Thamma

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘థామా’ వరల్డ్‌వైడ్‌గా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా గతంలో వచ్చిన మ్యాడాక్ బ్యానర్ చిత్రాలకు లింక్ చేసి ఉంటుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో వచ్చిన ‘స్త్రీ 2’ చిత్రానికి ఈ మూవీ చాలా దగ్గర పోలీకలు ఉండబోతున్నట్లు బి-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక, ఈ సినిమాలో పలువురు స్టార్స్ కూడా కేమియా పాత్రలతో అదరగొట్టబోతున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా వెల్లడించారు. ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, ఈ సినిమాలో ముగ్గురు స్టార్స్ కేమియోతో అలరిస్తారని.. అయితే వారెవరు అనేది సస్పెన్స్ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ముగ్గురు స్టార్స్‌లో ‘స్త్రీ-2’ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఒకరని కన్ఫమ్ అవుతోంది. మరి ఆ మిగతా ఇద్దరు ఎవరనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసే వరకు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు