క్రిస్మస్ రేస్‌లోకి దూసుకొస్తున్న గుణశేఖర్.. యూఫోరియాతో సెన్సేషన్ ఖాయం..?

క్రిస్మస్ రేస్‌లోకి దూసుకొస్తున్న గుణశేఖర్.. యూఫోరియాతో సెన్సేషన్ ఖాయం..?

Published on Oct 21, 2025 12:00 AM IST

దర్శకుడు గుణశేఖర్ తన లేటెస్ట్ చిత్రం ‘యూఫోరియా’ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. నీలిమ గుణ మరియు యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ తదితరులు నటిస్తున్నారు.

దీపావళి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్‌లో భూమిక చిరునవ్వుతో చిన్నారితో ఆడుకుంటూ కనిపించడం హృదయాన్ని తాకేలా ఉంది. గుణశేఖర్-భూమిక కలయికలో 20 ఏళ్ల క్రితం సూపర్ హిట్ మూవీ ‘ఒక్కడు’ తర్వాత వీరిద్దరు మళ్లీ ఇప్పుడు కలిసి సినిమా చేయడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కె.పొథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ మరియు “ఫ్లై హై” పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. మరి క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు