తమిళ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ ఇటీవల రిలీజై బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ఇక వరుస సెలవులు రావడంతో డ్యూడ్ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సినిమాకు బుక్ మై షోలో ఏకంగా మిలియన్ టికెట్ బుకింగ్స్ జరిగినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు దీపావళి సందర్భంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని.. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించగా సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.