ఆర్ ఆర్ ఆర్ గురించి ఏ విషయాలు బయట పడకుండా జాగ్రత్త పడుతూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాడు రాజమౌళి. అడపాదడపా లీకవుతున్న సంగతులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేలా ఉంటున్నాయి. కానీ ఆర్ ఆర్ ఆర్ నుండి అధికారంగా వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరి ఈ నెలలో ఆర్ ఆర్ ఆర్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. మరి ఆ రోజైనా రాజమౌళి అల్లూరి గా చరణ్ ని పరిచయం చేస్తాడా..? లేక ఆర్ ఆర్ ఆర్ విడుదలకు మరో పది నెలల సమయం ఉన్న నేపథ్యంలో స్కిప్ చేసి నిరాశపరుస్తాడో చూడాలి.
ఐతే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఏదో పెద్ద సర్ప్రైజే రాజమౌళి ఇవ్వనున్నాడని సమాచారం. చూద్దాం మరి జక్కన్న ఈనెల 27న ఏమీ చేయనున్నాడో. ఇక ఆర్ ఆర్ ఆర్ ని డి వి వి దానయ్య 350కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా నిర్మిస్తుండగా అలియా భట్, అజయ్ దేవ్ గణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.