మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా నిలదొక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే. మరి అందుకే బాస్ బాక్సాఫీస్ స్టామినాను ఎవరూ తక్కువ అంచనా వెయ్యరు. అయితే సినిమా హిట్ అయితే ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో తెలిసిందే.
అలా మరి తన లాస్ట్ చిత్రం “సైరా”కు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాగా ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న “ఆచార్య” విషయంలో కూడా ఎలా ఉంటుందా అన్న చర్చ మొదలయ్యింది. ఇప్పటికే ఒక్కో ఏరియాలో నెవర్ బిఫోర్ బిజినెస్ జరుగుతుంది అని సాలిడ్ ఫిగర్స్ ను ఇండస్ట్రీ వర్గాలు బయట పెడుతున్నాయి.
మరి అలాగే ఇప్పుడు ఓవర్సీస్ లో “ఆచార్య” రైట్స్ ఫ్యాన్సీ ప్రైజ్ కే అమ్ముడు పోయాయని తెలుస్తుంది. అలాగే అక్కడ బ్రేకీవెన్ కు కూడా ఆచార్య ముందు పెద్ద టార్గెట్ ఉన్నట్టే తెలుస్తుంది. మరి ఆ ఫిగర్స్ ఎంతో ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాయు నిర్మాణం వహిస్తున్నారు.