అందాల భామ శ్రియ సరన్ ప్రముఖ పాత్రాలో ఇటీవలే ప్రారంభమైన సినిమా ‘పవిత్ర’. జనార్ధన మహర్షి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై వస్తున్నా రూమర్స్ ని శ్రియ కొట్టి పారేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై వస్తున్న రూమర్స్ పై ఆమె స్పందిస్తూ ‘ పవిత్ర సినిమా న్యాయం కోసం పోరాడే ఒక అమ్మాయి కథ. సొసైటీ కోసం పోరాడుతుంది. ఆ తర్వాత పొలిటీషియన్ అయ్యి లేడీస్ కోసం పోరాడుతుంది. అంతేకాని ఇందులో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు ఉండవు. ఇది చాలా సున్నితమైన కథని’ చెప్పారు.
ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఈ సినిమాలో శ్రియ సెక్స్ వర్కర్ పాత్ర చేస్తోందని వార్తలు వచ్చాయి. అది తెలిసిన ఆమె ఫాలోవర్స్ చాలా మంది ట్విట్టర్లో నెగటివ్ కామెంట్స్ చెయ్యడంతో భాదపడిన శ్రియ స్పందిస్తూ ‘ కొంతమంది ఇడియట్స్ చేసే కొన్ని పనికిమాలిన రూమర్ ట్వీట్స్ చేయడానికే పుడతారు. అలాంటివి నన్ను చాలా బాధిస్తాయి. కొంతమంది చేసే ఇలాంటి శాడిస్ట్ పనుల వాళ్ళ ఇతరులు బాధపడుతున్నారని’ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం శ్రియ పవిత్ర సినిమాలో కాకుండా రూప అయ్యర్ ‘చంద్ర’ సినిమాలో నటించింది. ఇవి కాకుండా తను నటించిన ‘మిడ్ నైట్ చిల్డ్రన్స్’ సినిమా త్వరలో విడుదల కానుంది.