కరోనా దెబ్బకి కేరళలో థియేటర్లు బంద్ !

కరోనా దెబ్బకి కేరళలో థియేటర్లు బంద్ !

Published on Mar 10, 2020 4:28 PM IST

కరోనా కలకలంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలతో పాటు అన్ని సంస్థలు మరింత అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే భద్రతా చర్యలతో పాటు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకువెళ్తున్నారు. అందులో సినిమా థియేటర్స్ ను కొన్ని రోజుల పాటు బంద్ చేయబోతున్నారు. కేరళ లో కొరోనా వైరస్ కారణంగా, రేపటి నుంచి మార్చి 31 వరకు సినిమా థియేటర్లు మూసివేయబడతాయి. కొచ్చిలో జరిగిన వివిధ మలయాళ సినీ సంస్థల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇప్పటికే కరోనా ప్రభావం వల్ల థియేటర్స్ కలెక్షన్స్ లేక వెలవెలబోతున్నాయి. ఇన్నాళ్ళూ చైనా, ఇరాన్ లాంటి దేశాలకి పరిమితం అయిన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వేగంగా వచ్చేస్తోండటంతో అందరిలోనూ భయం మొదలైపోయింది. ఇక కరోనా భయం పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా సినిమా థియేటర్స్ కు కష్టనష్టాలు తప్పవు ఏమో.

తాజా వార్తలు